కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలంలోని శతాబ్దాల నాటి ప్రసిద్ధి గంగా పార్వతీ సమేత శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం వేళ ఆలయం పక్కనే ప్రవహిస్తున్న మన్నేరులో స్వామి వారి తెప్పోత్సవం కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి వీక్షించాలని కోరారు.