వలేటివారిపాలెం మండలం, మాలకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం భారీగా ఆదాయం వచ్చింది. మొత్తం రూ. 18, 23, 562 రాగా ఇందులో ప్రత్యేక దర్శనానికి రూ. 6, 52, 100, అన్న ప్రసాదానికి రూ. 6, 16, 126, లడ్డు ప్రసాదానికి రూ. 3, 24, 680, తలనీలాలకు రూ. 1, 01, 125, వివిధ పూజలు రూ. 30, 420, రూమ్ అద్దెలకు రూ. 24, 310 ఆదాయం వచ్చింది. కాగా వారంలో ఒకరోజు శనివారం మాత్రమే స్వామి దర్శనం ఉండడంతో భక్తులు భారీగా వచ్చి దర్శించుకుంటారు.