వలేటివారిపాలెం మండలం చుండి ఏపీ మోడల్ స్కూల్లో శనివారం జరిగిన 12వ వార్షికోత్సవంలో ముఖ్యఅతిథిగా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేపటి కాలానికి ముందడుగు నేటి బాలలే అని మీరంతా శ్రద్ధగా చదివి లక్ష్యాన్ని చేదించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్య తోనే పేదరికం జయించవచ్చని ఎమ్మెల్యే విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు ఎమ్మెల్యే తో సెల్ఫీ లు తీసుకున్నారు.