నెల్లూరు జిల్లా కావలి మండలంలోని మద్దూరుపాడు లోని ఏఎంసీ మార్కెట్ ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో పేకాట స్థావరంపై పోలీసులు శనివారం దాడులు చేశారు. పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారం రావడంతో కావలి ఎస్ఐ బాజీ బాబు తన సిబ్బందితో కలిసి పేకాట స్థావరంపై దాడి చేశారు. 6 మంది పేకాట రాయులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 9. 130 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీస్ స్టేషన్ కు తరలించారు.