నేడు జలదంకి మండలంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్ నూతన శాఖ ప్రారంభం కానుంది. ప్రారంభోత్సవానికి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్, కావలి శాసనసభ్యులు దగ్గు మాటి వెంకట కృష్ణారెడ్డి పాల్గొంటారు. జలదంకి మండలంలోని 17 పంచాయతీల టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని మండల టిడిపి అధ్యక్షుడు పులిగుంట మధుమోహన్ రెడ్డి పేర్కొన్నారు.