అడల్ట్ బిసిజి వ్యాక్సినేషన్ కార్యక్రమం

74చూసినవారు
అడల్ట్ బిసిజి వ్యాక్సినేషన్ కార్యక్రమం
అల్లూరు పట్టణంలోని స్థానిక మసీద్ సెంటర్లో శుక్రవారం అడల్ట్ బిసిజి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని స్థానిక వైద్య సిబ్బంది చేపట్టారు. ప్రతి ఇంటింటికి తిరుగుతూ వయోజనులకు వ్యాక్సిన్లు వేశారు. క్షయ వ్యాధి సోకకుండా ముందస్తుగా వయోజనులకు వ్యాక్సిన్ వేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎం ఎల్ హెచ్ పి హారిక, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్