అల్లూరు మండలంలో ఆగస్టు నెల ఒకటవ తేదీన పింఛన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి జ్యోతి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 7348 పింఛన్ లబ్ధిదారులకు గాను దాదాపుగా మూడు కోట్ల తొంబై ఆరు వేల రూపాయలు నగదు మంజూరైనట్లు తెలిపారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు.