అల్లూరు మండలంలోని పురిణి చెరువులో యానాది రైతులను తొలగించడం అన్యాయం అని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి పేర్కొన్నారు. బుధవారం కావలి ఆర్‌డిఓ కార్యాలయం ముందు దళిత సంఘర్షణ సమితి, యానాది సమాఖ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎస్ మల్లి మాట్లాడుతూ పురిణి చెరువులో ఆక్రమణ దారులలో పెద్ద పెద్ద రైతులను తొలగించకుండా ఎకరా, అర ఎకరా ఉన్నటు వంటి యానాది రైతులను తొలగించడం చాలా అన్యాయం అన్నారు.