నెల్లూరు జిల్లా అల్లూరు పోలేరమ్మ తిరునాళ్లలో పోలేరమ్మ గంగమ్మ కలుగోళమ్మలను కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అల్లూరి గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారం పోలేరమ్మ గంగమ్మ కలుగోళమ్మ తిరునాళ్లు అన్నారు. రైతులు అత్యధికంగా నివసించే ప్రాంతం అల్లూరు అని తెలిపారు. పాడిపంటలతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ఆ తల్లులను ప్రార్థించానన్నారు.