నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలో గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ తల్లి ఉత్సవాలు వైభవంగా జరుతున్నాయి. పరిమళ పుష్పాలతో ఎంతో సుందరంగా ఆలయ ప్రాంగణాన్ని అలంకరించడం భక్తులను కట్టిపడేస్తుంది. ఈ జాతరకు ఎంతో చరిత్ర ఉంది. పాడి పంటలతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని పోలేరమ్మ తిరునాళ్ళు నిర్వహించడం ఆనాదిగా వస్తున్న ఆచారం. ఎక్కడెక్కడో స్థిరపడిన ఈ ప్రాంత ప్రజలు ఈ జాతరకు తప్పనిసరిగా ఊరికి వస్తారు.