నెల్లూరు జిల్లా అల్లూరు పోలేరమ్మ తిరునాళ్ళు అద్భుతంగా జరుగుతున్నాయి. ఎంతో ప్రత్యేకంగా అమ్మవారి ఆలయాన్ని పరిమళ పుష్పాలతో అలంకరించారు. చుట్టుపక్కల నుంచి వందల సంఖ్యలో భక్తులు అక్కడికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. మంగళవారం రాత్రి కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి కూడా అమ్మవారిని దర్శించుకున్నారు.