నెల్లూరు జిల్లా అల్లూరు తహశీల్దారుగా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ బదిలీ అయ్యారు. ఆయనను ఏపీ మారిటైమ్ బోర్డు కావలి స్పెషల్ తహశీల్దార్ గా నియమించారు. అలాగే అల్లూరు నూతన తహశీల్దార్ ఫాజిహా ను నియమిస్తూ ప్రభుత్వ ఉన్నతాధికారులు మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఆమె త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా ఇన్ని రోజులు లక్ష్మీనారాయణ విశిష్ట సేవలు అందించినట్లు మండల ప్రజలు తెలిపారు.