అల్లూరు: జులై 10వ తేదీన గురు పౌర్ణమి వేడుకలు

58చూసినవారు
అల్లూరు: జులై 10వ తేదీన గురు పౌర్ణమి వేడుకలు
నెల్లూరు జిల్లా అల్లూరు లోని షిర్డీ సాయిబాబా మందిరంలో జులై 10వ తేదీన గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను దేవస్థానం ప్రాంగణంలో ఆదివారం ఆవిష్కరించారు. గురు పౌర్ణమి రోజు స్వామివారికి అభిషేకం, లక్ష మల్లెల పూజ, వివిధ రకాల పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు.

సంబంధిత పోస్ట్