నెల్లూరు జిల్లా అల్లూరు మండలం లోని పురిని గ్రామంలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సచివాలయం సిబ్బంది ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. యోగా చేయడం వలన మానసిక, శారీరక ప్రశాంతత లభిస్తుంది అని తెలిపారు. యోగా అనేది మానవాళి జీవితంలో ఒక భాగం కావాలన్నారు.