తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉదయగిరి, సీతారాంపురం, వరికుంటపాడు మండలాల్లో ఆకాశం మేఘావృతమై మబ్బులు కమ్ముకున్నప్పటికీ వర్షం పడటం లేదు. సంఘం, ఆత్మకూరు, కావలి, బుచ్చి ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుంది. నెల్లూరు పట్టణంలో గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న కారణంగా చిరు వ్యాపారస్తులు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.