అల్లూరులో ఆయుష్ వైద్యులు సుబ్బారెడ్డి పదవి విరమణ కార్యక్రమం

59చూసినవారు
అల్లూరులో ఆయుష్ వైద్యులు సుబ్బారెడ్డి పదవి విరమణ కార్యక్రమం
అల్లూరు నగరంలోని ఆయుర్వేద వైద్యశాల నందు విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కే సుబ్బారెడ్డి బుధవారం పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆత్మీయులు అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆయుష్ డిపార్ట్మెంట్ విభాగంలో దాదాపుగా 36 సంవత్సరాలు ఆయన విధులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సిబ్బంది, సన్నిహితులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్