నెల్లూరు జిల్లా బోగోలు మండలం జగనన్న కాలనీలో స్థల వివాదం కారణంగా మంగళవారం ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. తెలుగుదేశం పార్టీ, వైసీపీ మద్దతుదారులైన వీరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కాగా దాడి చేసుకున్న వారు బంధువులు కావడం గమనార్హం. తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడు సురేంద్ర, వైసిపి మద్దతుదారుడు బాబుకు తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిని కావలి ఏరియా వైద్యశాలలో చికిత్స నిమిత్తం చేర్పించారు.