బోగోలు: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

79చూసినవారు
బోగోలు: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. బోగోలు మండలం జువ్వలదిన్నె సమీపంలో గత నెలలో 35 ఏళ్ల వ్యక్తికి ఓ ప్రమాదంలో గాయాలయ్యాయి. వైద్యం కోసం నెల్లూరు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఆ వ్యక్తి మృతి చెందాడు. ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత లేదు. ఎస్సై బొజ్యానాయక్ స్పందిస్తూ ఆసుపత్రి నుంచి సమాచారం రాగానే కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్