బోగోలు మండలం లోని కొండ బిట్రగుంట లో గల శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగ జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు మంగళవారం స్వామివారికి హనుమంత సేవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి దర్శించుకున్నారు. స్వామివారు హనుమంత వాహనంలో ఊరేగుతూ గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు.