బోగోలు మండలం సోమేశ్వర పురం గ్రామంలో శుక్రవారం శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి వారి విగ్రహ శిలా ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులు కావలి నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలన్నారు.