కూటమి ప్రభుత్వ సూపర్ సిక్స్ పథకాలతో ప్రతి ఇల్లూ సంతోషంగా ఉందని, కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పట్ల ప్రజల్లో సంతృప్తి నెలకొందని కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గురువారం ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి బోగోలు మండలం కొండ బిట్రగుంట గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వివరాలను మై టీడీపీ యాప్‌లో అప్ లోడ్ చేసి వారితో సెల్ఫీ దిగారు.