దగదర్తి లో తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు నివాసం వద్దకు భారీగా టిడిపి నాయకులు, కార్యకర్తలు చేరుకొని సంబరాలు చేసుకొన్నారు. ఆంధ్ర రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా మాలేపాటికి అవకాశం రావడం, అలాగే బుధవారం ఆయన పుట్టినరోజు ను కూడా పురస్కరించుకొని తెలుగుదేశం శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి, భారీగా బాలసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.