ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు, మాజీ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ మాలేపాటి రవీంద్ర నాయుడు వారి కుమారుల ఆధ్వర్యంలో దగదర్తి గ్రామంలోని వారి స్వగృహం వద్ద బుధవారం ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఇటీవల మాలేపాటి భాను జన్మదినం సందర్భంగా వీరందరికీ కంటి పరీక్షలు నిర్వహించి అర్హులైన 150 మందికి ఈరోజు కంటి అద్దాలు పంపిణీ చేశారు. 15 మందికి కంటి శస్త్ర చికిత్సలు చేయించారు.