దగదర్తి పోలీస్ వారికి రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు శనివారం సున్నం బట్టి అటవీ ప్రాంతంలో పేకాట స్థావరాలపై దగదర్తి ఎస్సై జంపాని కుమార్ మరియు సిబ్బంది దాడులు నిర్వహించారు. నలుగురు వ్యక్తులని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ. 19, 130 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మండలంలో పేకాట కోడిపందాలు లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్ఐ హెచ్చరించారు.