దగదర్తి తహసిల్దార్ కార్యాలయంలో ఈరోజు జరిగిన గ్రీవెన్స్ డే లో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు పాల్గొని ప్రజల సమస్యలపై అధికారులతో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో వివరించాలని కోరారు. అత్యధిక సంఖ్యలో పాల్గొన్నటువంటి అర్జీదారుల సమస్యలను వెంటనే పరిష్కరించవలసిందిగా ముఖ్యంగా అడంగల్ కాపీల మంజూరులో అలసత్వం ఊహించవద్దని అధికారులను కోరారు.