దగదర్తి మండలం పెదపుట్టేడు పంచాయతీ రామలింగాపురం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత అదనపు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది. ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు. స్కూల్ ప్రాంగణంలో ఎమ్మెల్యే చెట్టు నాటారు. అలాగే స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.