దగదర్తి మండలం వెలుపోడు, తురిమెర్ల, పెద్దపుత్తెడు గ్రామాలలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం శనివారం జరిగింది. ఇందులో ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూడు దశాబ్దాలుగా ప్రజలకు అందని దాక్షాల ఉన్న భూ పంపిణీకి ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. వెలుపోడు గ్రామస్తులకు 238 ఎకరాలు 238 కుటుంబాలకు పట్టాలు ఇచ్చి భూస్థానం చూపించారు. మిగిలిన 200 ఎకరాల భూమి త్వరలో పంపిణీ చేస్తామన్నారు.