దగదర్తి మండలంలోని పలు గ్రామాల ప్రజలు సోమవారం టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు ని మరియు మాజీ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ మాలేపాటి రవీంద్రనాయుడుని దగదర్తిలోని వారి నివాసం వద్ద కలిశారు. ఆయా గ్రామ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇస్తూ గృహ నిర్మాణం కొరకు వచ్చిన వారికి అవసరమైన రేకులు, సిమెంట్ ను అందజేసి అలాగే వారికి భోజన సదుపాయాన్ని కల్పించారు.