భారతీయ జనతా పార్టీ(బిజెపి) ఆధ్వర్యంలో కావలిలో ముందస్తుగా అంబేద్కర్ జయంతి నిర్వహించారు. రేపు అంబేద్కర్ జయంతి కావడంతో ముందస్తుగా కావలి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి బిజెపి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి బీజేపీ నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చేసిన కృషి, సేవను దేశ ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరు అన్నారు.