కావలి బులియన్ మర్చంట్స్ అసోసియేషన్, కుదువ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులుగా మొగలపల్లి రాజా, కోటా రమేష్ ఎన్నికయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారిని పలువురు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. తమపై నమ్మకంతో అధ్యక్షులుగా ఎన్నుకున్న బంగారు, కుదువ వ్యాపారస్తులకు ధన్యవాదాలు తెలియజేశారు.