నెల్లూరు జిల్లాలో ఓ నకిలీ ఎస్సై హల్ చల్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అల్లూరు మండలం నార్త్ ఆములూరు చెందిన హరీశ్ ఇటీవల ఎస్ఐగా ఎంపికయ్యానని ట్రైనింగ్ పూర్తయిందని యూనిఫాం ధరించి తిరిగేవాడు. ఈ క్రమంలో సంగం పోలీసులు అదుపులోకి తీసుకొని బుధవారం కేసు నమోదు చేసి విచారించారు. కాగా నిందితుడు రెండు సార్లు ఎస్సై పరీక్షలు రాయగా ఎంపిక కాలేదు.