దగదర్తి: ఉలవపాళ్ళ పొలాల్లో గడ్డివాముల దగ్ధం

71చూసినవారు
దగదర్తి: ఉలవపాళ్ళ పొలాల్లో గడ్డివాముల దగ్ధం
నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలోని ఉలవపాళ్ళ సమీపంలోని పొలాల్లో గడ్డివాములకు గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం అర్ధరాత్రి సమయంలో నిప్పు పెట్టారు. గ్రామ రైతులు అక్కడి పొలాలను కౌలుకు తీసుకొని వరి సాగు చేశారు. పంట పండిన తరువాత ధాన్యాన్ని అమ్ముకుని గడ్డిని మోపులుగా కట్టి పోలాల్లో ఉంచారు. ఈ క్రమంలో ఇలా జరగడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్