హైదరాబాద్ కు చెందిన భారతి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో 4, 218 చిన్నారులు ప్రదర్శించిన అతి పెద్ద కూచిపూడి నాట్యానికి గిన్నిస్ వరల్డ్ రికార్డు లభించింది. అందులో భాగస్వాములు అయిన కావలి కి చెందిన శ్రీ మేధ నృత్య కళా నిలయం చిన్నారులు కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి ని ఆదివారం కలిశారు. వారు సాధించిన మెడల్స్, సర్టిఫికెట్లను ఆయన చూసి హర్షం వ్యక్తం చేశారు. కావలికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారని అభినందించారు.