తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా ప్రతిరోజు ఇంటి వద్దకు వచ్చే పంచాయతీ గ్రీన్ అంబాసిడర్లకు అందజేసి, గ్రామాలను చెత్త లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీవో అన్నారు. కావలి మండలం మున్నంగి దిన్నె గ్రామపంచాయతీలో ఎంపీడీవో శ్రీదేవి శుక్రవారం పర్యటించారు. అనంతరం చిత్త సంపద కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి విస్తరణ అధికారి సమద్, పంచాయతీ కార్యదర్శి గీత. మరియు గ్రీన్ అంబాసిడర్లు పాల్గొన్నారు.