సినీ హీరో, తెలుగుదేశం పార్టీ కీలక నేత, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు కావలిలో తెలుగుదేశం పార్టీ నాయకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి బాలకృష్ణకు తెలుగుదేశం పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కావలి ఏరియా వైద్యశాలలో రోగులకు పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ మంచి మనసున్న గొప్ప మనిషి బాలకృష్ణ అని అన్నారు.