నెల్లూరు జిల్లా అల్లూరు పట్టణంలోని తూర్పు వీధి మారుతీ కాలనీలో శనివారం సాయంత్రం ఓ గడ్డి వాము దగ్ధమైంది. సుమారు 15 అడుగుల మేర పొడవున్న గడ్డివాము అని స్థానికులు తెలిపారు. గడ్డివాము దగ్ధంతో రూ. 70 వేల వరకు నష్టం వాటిల్లిందన్నారు. మంటలను అదుపు చేసేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికి మంటలు భారీగా ఎగసిపడడంతో ప్రయత్నం విఫలమైంది. ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.