కావలి పట్టణం ఎన్టీఆర్ సర్కిల్లో గురువారం వంద అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం మానసిక వైకల్యం కలిగిన బాల బాలికలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర విచ్చేశారు. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, టిడిపి నేతలు తదితరులు పాల్గొన్నారు.