ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నెల్లూరులోని ఆయన నివాసంలో టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, కావలి సీనియర్ నేత మాలేపాటి సుబ్బానాయుడు శనివారం కలిసారు. కావలి నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ పరిణామాలపై ఎంపీకి లేఖ అందజేశారు. గత కొన్ని రోజుల నుంచి మాలేపాటి విజయవాడలోని పలువురు మంత్రులతో పాటు నారా లోకేష్ ను సైతం కలిసి కావలి సమస్యల గురించి వివరించారు. ఈ విషయం కావలి వ్యాప్తంగా చర్చియాంశంగా మారింది.