కావలి: కోడిపందాలు ఆడుతున్న 12 మంది అరెస్ట్

65చూసినవారు
కావలి: కోడిపందాలు ఆడుతున్న 12 మంది అరెస్ట్
నెల్లూరు జిల్లా కావలి రూరల్ చలంచర్లలో కోడిపందాల స్థావరాలపై ఆదివారం పోలీసులు దాడులు చేశారు. కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారం రావడంతో కావలి రూరల్ సీఐ రాజేశ్వరరావు, ఎస్సైలు తిరుమలరెడ్డి, బాజీ బాబు దాడులు చేశారు. 12 మంది నిందితులను అదుపు లోకి తీసుకొని వారి వద్ద నుంచి 9 కోల్లు, రూ. 12, 090 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరు పరుస్తామని సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్