కావలి పట్టణ శివారులో బుధవారం పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. తుమ్మలపెంట రహదారికి ఆనుకొని ఉన్న స్థిరాస్తి క్షేత్రంలోని ఉపాధ్యాయిని అంజనీదేవి ఇంట్లో బీరువాలో ఉన్న 20 సవర్ల బంగారు ఆభరణాలు దొంగలించారు. వీరు పాఠశాలలో విధులకు హాజరైన సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.