9వ శ్రీశ్రీ గౌర నితాయ్ (కృష్ణ - బలరామ్) రథయాత్ర శనివారం కావలి పట్టణంలో వైభవంగా జరుగుతుంది. ఈ రథయాత్రలో కావలితో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు వేలాది సంఖ్యలో తరలివచ్చి పాల్గొన్నారు. ప్రత్యేక నృత్య ప్రదర్శనలు, నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, డీజే పాటలు, డప్పులతో రథయాత్ర భారీ తిరణాలను తలపిస్తుంది. ఎమ్మెల్యే, పోలీసులు, ప్రముఖ నాయకులు, అధికారులు సైతం రథయాత్రలో పాల్గొని రథంతో కలిసి నడిచారు.