కావలి నియోజకవర్గంలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి "ఆల్ ద బెస్ట్" చెప్పారు. పిల్లలు అందరూ పరీక్షలు బాగా రాసి కావలి కీర్తిని ఆంధ్ర రాష్ట్ర నలుమూల వ్యాపింప చేయాలని ఎమ్మెల్యే కోరారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పిల్లలకు ప్రోత్సాహం అందించి వారు ఉత్తం ఫలితాలు సాధించేందుకు తోడ్పడాలని కోరారు. భయపడకుండా, శ్రద్ధగా పరీక్షలు రాయాలని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి సూచించారు.