ఆర్యవైశ్య చైర్మన్ డూండీ రాకేష్, కావలి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తీ రమేష్ ఆధ్వర్యంలో పలువురు ఆర్యవైశ్యులు గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ని కలిశారు. రాష్ట్రంలో వివిధ పేర్లతో ఉన్న వైశ్యులందరిని ఆర్య వైశ్యులుగా పరిగణించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి వినతిపత్రం అందజేశారు. వినతిని తప్పకుండా పరిశీలిస్తారని సీఎం చంద్రబాబు నాయుడు వారికి హామీ ఇచ్చినట్లు వారి తెలిపారు.