శాసనమండలి సభ్యునిగా (ఎమ్మెల్సీ) బీద రవిచంద్ర యాదవ్ బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. శాసన మండలి చైర్మన్ వద్ద రవిచంద్ర ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపడతారు. ముందుగా సీఎం చంద్రబాబు ఆశీర్వాదం తీసుకుని అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఎందుకు ముహూర్తం ఖరారైంది. నెల్లూరు, కావలి నుంచి భారీగా బీద కుటుంబ అభిమానులు, రవిచంద్ర అభిమానులు, తెలుగుదేశం పార్టీ నేతలు వెళ్ళనున్నారు.