కావలి: పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ

68చూసినవారు
నెల్లూరు జిల్లా కావలి పట్టణం రెడ్ క్రాస్ భవనంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా మహిళా పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్ల పంపిణీ చేసి ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు పురుషులతో పాటు అన్ని రంగాల్లో ముందుకు రాణించాలన్నారు. మహిళల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

సంబంధిత పోస్ట్