తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ సతీమణి జ్యోతి తండ్రి పొన్నేబోయిన సుందర రామయ్య యాదవ్ సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన భౌతికాయానికి మాజీ జడ్పీ చైర్మన్ చెంచల బాబు యాదవ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు, చెంచు కిషోర్ యాదవ్ నివాళులర్పించారు.