నిరంతరం ప్రజల కోసం పరితపించే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఆయన సహకారంతో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా రాష్ట్రం ముందుకు సాగుతుందని కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి తెలిపారు. శనివారం కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని 87 మంది లబ్ధిదారులకు సంబంధించిన రూ. 93, 61, 938 చెక్కులను అందజేశారు.