కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాలతో కావలి వైసిపి నాయకులు కావలిలోని విద్యుత్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన చేపట్టారు. అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి అధికారం సొంతం చేసుకున్న తర్వాత మాట మార్చి సామాన్య ప్రజలపై విద్యుత్ భారం మోపడం కూటమి ప్రభుత్వానికి న్యాయమా అంటూ నిలదీశారు. వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.