కావలి పట్టణంలోని జర్నలిస్ట్ క్లబ్ లో మాజీ ఎంపీ చింత మోహన్ మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక పేదలకు చేసింది ఏమీ లేదని, ఈవీఎంల ట్యాంపరింగ్ తోనే ఈ దేశంలో బీజేపీ చలామణి అవుతుందని ఘాటుగా విమర్శించారు. మూడుసార్లు ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ దేశానికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వంలో ప్రజలకు ఎటువంటి లబ్ధి జరగలేదని విమర్శించారు.