కావలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి బుధవారం సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. అలాగే కావలికి చెందిన బీద మస్తాన్ రావు రాజ్యసభ ఎంపీగా ఎన్నికవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు.